NZB: ఆర్మూర్ పట్టణంలో SGF 14 సంవత్సరాల బాలబాలికల జట్ల హాకీ సెలక్షన్స్ నిర్వహించినట్లు నిజామాబాద్ జిల్లా హాకీ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి రమణ తెలియజేశారు. బాలురు దాదాపుగా 74, బాలికలు 63 మంది హాజరైనట్లు తెలియజేశారు. ఇందులో నుండి తుది జట్టుకు 18 మంది క్రీడాకారులను మాత్రమే ఎంపిక చేసినట్లు వివరించారు.