TG: ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి రాష్ట్రంలో ఆస్పత్రుల నిర్వహణపై కీలక వ్యాఖ్యలు చేశారు. ‘ఇంత టెక్నాలజీ పెరిగినా కల్వకుర్తి ఆస్పత్రిలో కనీసం ఏసీ సౌకర్యం కూడా లేదు’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. సౌకర్యాలు లేక రోగులను హైదరాబాద్కు పంపుతున్నారని, లక్షల కోట్లు ఖర్చు చేస్తున్నా.. వెళ్లే దారిలోనే ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.