MDCL: ఘట్కేసర్లోని డీజీఆర్ కన్వెన్షన్లో అందెశ్రీ సంతాప సభను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ ఈటల రాజేందర్ పాల్గొని అందెశ్రీ చిత్రపటానికి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మరణించేంతవరకు సమాజంలో ఉన్న అట్టడుగు ప్రజానీకం కోసం తపన పడ్డ మహనీయుడు అందెశ్రీ అన్నారు. ఆయన మన మధ్య లేకపోయినా ఆయన పాటలు, మాటలు సజీవంగా ఉంటాయన్నారు.