KMM: ముదిగొండ మండలంలోని పెద్దమండవ గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని గిడ్డంగుల సంస్థ ఛైర్మన్ నాగేశ్వరరావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతులకు సకాలంలో ధాన్యం కొనుగోలు చేయడం ప్రభుత్వ ప్రాధాన్యత అని, రైతుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు.