కృష్ణా: జగ్గయ్యపేట మండలం తిరుమలగిరిలో ఉన్న జిన్నింగ్ మిల్ వద్ద రైతులు తీసుకు వస్తున్న పత్తిని వైసీపీ ఇన్ఛార్జ్ తన్నీరు నాగేశ్వరరావు పరిశీలించారు. తుఫాను వల్ల రైతులకి భారీ నష్టం వాటిలిందని పేర్కొన్నారు. చేతికి వచ్చిన పంట అమ్మటానికి సరైన ధర లేక రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారని తెలిపారు. ప్రభుత్వం ఇస్తున్న 12శాతాన్ని తేమ శాతాని 18% ఇవ్వాలని డిమాండ్ చేశారు.