అన్నమయ్య: రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమం సీఎం చంద్రబాబు నాయుడుకు రెండు కళ్ళు అని రోడ్లు, భవనాల శాఖమంత్రి బీసీ జనార్దన్ రెడ్డి అన్నారు. ఇవాళ మదనపల్లెలోని ఆర్అండ్బి గెస్ట్ హౌస్కు ఆయన విచ్చేశారు. స్థానిక ఎమ్మెల్యే షాజహాన్ భాష మంత్రికి ఘన స్వాగతం పలికారు. జనార్దన్ రెడ్డి మాట్లాడుతూ.. మదనపల్లె అభివృద్ధికి కృషి చేస్తామన్నారు. ప్రజలకు ఏ సమస్య ఉన్న కూటమి ప్రభుత్వం ముందు ఉంటుందని తెలిపారు.