HYD: తెలంగాణ రైతులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రాంచందర్ రావు అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పత్తి కొనుగోళ్లలో పారదర్శకత కోసం కేంద్రం ‘కపాస్ కిసాన్ యాప్’ అనే కొత్త మొబైల్ యాప్ను ప్రవేశపెట్టిందన్నారు. ఈ యాప్ ద్వారా రైతులకు టైమ్ స్లాట్ కేటాయిస్తారని, దళారుల జోక్యం ఉండదన్నారు. చెల్లింపులు నేరుగా రైతుల బ్యాంకులకు జమ అవుతాయన్నారు.