SKLM: ఆమదాలవలస కృషి విజ్ఞాన కేంద్రంలో కూరగాయల నారు పెంపకంపై నిర్వహించిన మూడు రోజుల వృత్తి శిక్షణ కార్యక్రమం బుధవారం ముగిసింది. డా.కె. భాగ్యలక్ష్మి, ప్రోగ్రాం కోఆర్డినేటర్ మాట్లాడుతూ.. నాణ్యమైన విత్తనాలు, షేడ్ నెట్లలో నారు తయారీ, చీడపీడల నియంత్రణ పద్ధతులపై శిక్షణ అందించినట్లు తెలిపారు. అనంతరం శిక్షణ పొందిన వారికి సర్టిఫికెట్లను ప్రదానం చేశారు.