SRD: అనారోగ్యంతో బాధపడుతున్న మాజీ ఎమ్మెల్యే తాంతియా కుమారిని మంత్రి దామోదర రాజనర్సింహ పరామర్శించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ఉప ముఖ్యమంత్రి కోనేరు రంగారావు కుమార్తె, మాజీ ఎమ్మెల్యే తాంతియా కుమారి అనారోగ్యంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతుంది. ఈ విషయం తెలిసి ఆసుపత్రికి వెళ్లి మంత్రి పరామర్శించి డాక్టర్లతో ఆమె ఆరోగ్య పరిస్థితిపై చర్చించారు.