2026 పురుషుల అండర్-19 ప్రపంచకప్ షెడ్యూల్‌ను ఐసీసీ తాజాగా విడుదల చేసింది. 16 జట్లు పాల్గొనే ఈ మెగా టోర్నీ 2026 జనవరి 15 నుంచి ప్రారంభం కానుంది. తొలి మ్యాచ్‌లో భారత్, యూఎస్ తలపడనున్నాయి. జింబాబ్వే, నమీబియా సంయుక్తంగా ఆతిథ్యమివ్వనున్న ఈ టోర్నీలో మొత్తం 41 మ్యాచ్‌లు జరుగనున్నాయి. ఫిబ్రవరి 6న హరారేలో జరిగే ఫైనల్‌తో ఈ టోర్నీ ముగుస్తుంది.