MDK: రోడ్లపై ధాన్యం ఆరబోస్తే కఠిన చర్యలు తీసుకుంటామని బుధవారం ఎస్సై పోచయ్య హెచ్చరించారు. రైతులు రోడ్లపైనే ధాన్యాన్ని ఆరబెట్టడం వల్ల వాహనదారులకు ప్రమాదాలు సంభవించే అవకాశం ఉందని తెలిపారు. ప్రత్యేకంగా రాత్రి వేళల్లో ధాన్యం కుప్పలపై నల్లని టార్ఫాలిన్ కప్పి ఉంచడం వల్ల వాహనాలకు కనిపించక పెను ప్రమాదాలకు దారితీస్తుందని పేర్కొన్నారు.