NGKL: తాడూరు మండల నూతన ఎమ్మార్వోగా ఎం.రామకృష్ణయ్య బుధవారం బాధ్యతలు స్వీకరించారు. బదిలీల్లో భాగంగా ఆయన తిమ్మాజీపేట నుంచి తాడూరుకు వచ్చారు. తాజాగా ఆయన మాట్లాడుతూ.. మండల ప్రజలకు పారదర్శకమైన సేవలు అందిస్తూ, రెవెన్యూ కార్యక్రమాలను వేగవంతం చేస్తానని తెలిపారు. అలాగే అధికారులతో సమన్వయం పాటిస్తూ ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు.