NTR: కంచికచర్ల పట్టణంలోని రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో బుధవారం వృద్ధులకు దుప్పట్ల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ఏఎంసీ ఛైర్మన్ కోగంటి బాబు పాల్గొని, వృద్ధులకు దుప్పట్లు పంపిణీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. రిటైర్మెంట్ ఉద్యోగోలు తమ వంతు సమాజ సేవ చేస్తూ అందరికీ ఆదర్శవంతంగా నిలుస్తున్నారని అన్నారు.