W.G: పచ్చదనం, పరిశుభ్రతకు ప్రతీ ఒక్కరూ పాటుపడాలని నియోజకవర్గ ప్రత్యేక అధికారి మల్లికార్జునరావు అన్నారు. బుధవారం పెంటపాడు మండల పరిషత్ సమావేశ మందిరంలో క్లీన్ అండ్ గ్రీన్ విలేజ్ పై సర్పంచులు, ఉప సర్పంచ్లకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఇళ్లలోని చెత్తను రోడ్లపై పారేయకుండా పంచాయతీ సిబ్బందికి అందించాలన్నారు. తద్వారా గ్రామాలు పరిశుభ్రంగా ఉంటాయన్నారు.