మహబూబ్నగర్లో అంత్యక్రియలకు డబ్బుల్లేక తండ్రి పడ్డ వేదన కంటతడి పెట్టించింది. అనారోగ్యంతో దివ్యాంగుడైన కొడుకు చనిపోతే, తండ్రి బాలరాజ్ మృతదేహాన్ని భుజాన మోస్తూ స్మశానానికి చేరాడు. చేతిలో చిల్లిగవ్వ లేక శవాన్ని ఒడిలో పెట్టుకుని 5 గంటలు సాయం కోసం ఎదురుచూశాడు. 4 రోజులుగా తిండి లేదని వాపోయాడు. చివరకు ఓ స్వచ్ఛంద సంస్థ సాయంతో అంత్యక్రియలు జరిపించాడు.