NLG: పేద ప్రజలను అభివృద్ధి పథంలో తీసుకురావడం కోసం మాజీ ప్రధాని ఇందిరా గాంధీ అనేక సంక్షేమ కార్యక్రమాలను ప్రవేశపెట్టారని గిరిజన గురుకుల కళాశాల ప్రిన్సిపల్ జాను నాయక్, వైస్ ప్రిన్సిపల్ రాజరత్నం అన్నారు. మిర్యాలగూడలోని అవంతిపురం గిరిజన గురుకుల కళాశాలలో ఇందిరా గాంధీ జయంతి సందర్భంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో అజయ్ కుమార్, సరిత, మంగ్యా నాయక్ పాల్గొన్నారు.