KMM: ప్రారంభ బాల్య అభివృద్ధి సేవలను మెరుగుపరచడంపై ప్రభుత్వం దృష్టి పెడుతుందని, ఉపాధ్యాయులు తమ బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించాలని జిల్లా పరిషత్ సీఈవో దీక్షా రైనా సూచించారు. ముదిగొండ మండలంలోని మిట్టగూడెం, మాదాపురం ప్రాథమిక పాఠశాలలను బుధవారం ఆమె తనిఖీ చేశారు. పాఠశాలల్లోని బోధనా పద్ధతులను పరిశీలించి, విద్యార్థులను నేరుగా ప్రశ్నలు అడిగారు.