KNR: ఇందిరాగాంధీ జయంతిని పురస్కరించుకుని సైదాపూర్ పాత బస్టాండ్ వద్ద ఆమె జయంతి వేడుకలు కాంగ్రెస్ నాయకులు ఘనంగా నిర్వహించారు. భారతదేశ ఐక్యత, సమగ్రతను కాపాడేందుకు అలుపెరుగని పోరాటం చేసిన ఉక్కు మహిళగా, తొలి మహిళా ప్రధానిగా భారతదేశానికి సేవలందించారని గుర్తుచేశారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ ఛైర్మన్ దొంత సుధాకర్, గుండారపు శ్రీనివాస్ పాల్గొన్నారు.