గుజరాత్ మోహసానాలోని అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్ ముందు జనం బారులు తీరారు. కొత్తగా ముద్రించిన రూ.10 నోట్లు, నాణేలను ప్రత్యేక శిబిరాల ద్వారా జారీ చేస్తున్నట్లు ఆ బ్యాంక్ ప్రకటించింది. దీంతో శిబిరాలకు జనం బారులు తీరారు. వీటి ద్వారా మొత్తం రూ.14 లక్షల విలువైన రూ.10, రూ.20 నోట్ల కట్టలు, రూ.3 లక్షల విలువైన రూ.2, రూ.5 నాణేలను జారీ చేసినట్లు అధికారులు తెలిపారు.