KRNL: గోనెగండ్ల మం. గంజహళ్లి గ్రామానికి చెందిన వైసీపీ ప్రస్తుత ఎంపీటీసీ, మాజీ ఎంపీటీసీ సుమారు 200 మందితో కలిసి ఇవాళ టీడీపీ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఎమ్మిగనూరులోని తన నివాసంలో MLA బీవీ జయనాగేశ్వర్ రెడ్డి వారికి పసుపు కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. పాత, కొత్త నేతలను కలుపుకొని పార్టీ బలోపేతానికి కృషిచేస్తామని MLA తెలిపారు.