GNTR: జిల్లా సౌత్ పోలీస్ సబ్ డివిజన్ కార్యాలయంలో రుణ రికవరీ ఏజెంట్లతో బుధవారం సమావేశం జరిగింది. రుణగ్రహీతలను బెదిరించడం, వేధించడం, వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం కలిగించడం చట్టవిరుద్ధమని డీఎస్పీ భానోదయ హెచ్చరించారు. ఏజెంట్లు కేవలం అనుమతి పొందిన సమయాల్లో, మర్యాదపూర్వకంగా మాత్రమే రుణగ్రహీతలకు సంప్రదించాల్సిందిగా సూచించారు.