PDPL: రామగుండం పోలీస్ కమీషనర్ ఆదేశాల మేరకు పెద్దపల్లి షీటీమ్, గోదావరిఖని శ్రీనగర్ కాలనీలోని ఓ ఐటీఐ కాలేజీ విద్యార్థులకు అవగాహన సదస్సు నిర్వహించచారు. ఈ కార్యక్రమం షీటీం ఇంఛార్జ్ ఎస్సై లావణ్య ఆధ్వర్యంలో జరిగింది. తెలంగాణ పోలీస్ శాఖ యువతులు భద్రంగా, నిస్సంకోచంగా జీవించేలా షీ టీమ్స్ అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేస్తోందని తెలిపారు.