NLG: పట్టణంలోని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి క్యాంపు కార్యాలయంలో ఇందిరా గాంధీ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. మాజీ ఛైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి, వైస్ ఛైర్మన్ అబ్బగోని రమేష్ గౌడ్ ఆమె చిత్రపటానికి పూలమాలలు అర్పించారు. ఈ కార్యక్రమంలో వంగూరి లక్ష్మయ్య, జూకూరి రమేష్, డీసీసీబీ డైరెక్టర్ పాశం సంపత్ రెడ్డి పాల్గొన్నారు.