JN: మహిళల ఉన్నతి, తెలంగాణ ప్రగతి నినాదంతో సీఎం రేవంత్ రెడ్డి ఇందిరమ్మ చీరల పంపిణీపై బుధవారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో జిల్లా కలెక్టర్ రిజ్వాన్ భాషా షేక్ పాల్గొన్నారు. ఈ మేరకు ఆయన మాట్లాడుతూ.. కోటి మంది మహిళలకు కోటి చీరల పంపిణీ లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగుతోందని, ప్రతి నియోజకవర్గానికి ప్రత్యేక అధికారిని నియమించి, డిసెంబర్ 9 లోపు పంపిణీ పూర్తి చేయాలన్నారు.