WG: మలికిపురం మండలం లక్కవరానికి చెందిన శిరిగినీడి జాహ్నవి(9) మృతదేహం బుధవారం లభ్యమైంది. సోమవారం ఆధార్ అప్డేట్ చేయిస్తానని ఇంట్లో వారికి చెప్పి ఇద్దరు పిల్లల్ని తీసుకెళ్లి వారిని నదిలో తోసేసి దుర్గాప్రసాద్ ఆత్మహత్య చేసుకున్నాడు. తండ్రి శిరిగినీడి దుర్గాప్రసాద్, కుమారుడు మోహిత్ మృతదేహాలు మంగళవారం లభ్యమైన సంగతి విధితమే. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.