SRD: తన పరిపాలన దక్షతతో భారత దేశ ఉక్కుమహిళగా పేరుగాంచిన వీరవనిత మాజీ ప్రధాని, భారతరత్న ఇందిరాగాంధీ అని మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జ్ నీలం మధు అన్నారు. ఇవాళ ఇందిరాగాంధీ జయంతి పురస్కరించుకుని చిట్కూల్లోని ఆయన నివాసం వద్ద, పేదలకు అందించిన సంక్షేమాన్ని స్మరించుకుంటూ ఆమె చిత్రపటానికి పూలు వేసి ఘన నివాళులు అర్పించారు.