MNCL: మంచిర్యాలలోని ప్రభుత్వ ఐటీఐ కాంప్లెక్స్‌లో ఈ నెల 21న మినీ జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి కల్పన శాఖ అధికారి రవికృష్ణ తెలిపారు. జిల్లా కేంద్రంతో పాటు హైదారాబాద్‌లోని ప్రైవేట్ ఆసుపత్రి, ఫార్మసీలో 115 ఉద్యోగాలకు అర్హత కలిగిన అభ్యర్థులు జాబ్ మేళాకు హాజరు కావాలని సూచించారు. ఈ అవకాశాన్ని నిరుద్యోగ యువత సద్వినియోగం చేసుకోవాలన్నారు.