SRD: GHMC రామచంద్రపురం 112 డివిజన్లోని అభివృద్ధి పనులపై సమీక్షా సమావేశం నిర్వహించినట్లు కార్పొరేటర్ పుష్పా నగేష్ అన్నారు. జీహెచ్ఎంసీ అన్ని డిపార్ట్మెంట్ల అధికారులతో మిగిలి ఉన్న అభివృద్ధి పనులపై సమీక్షలో సుదీర్ఘంగా చర్చించినట్లు తెలిపారు. డిసెంబర్ మొదటి వారంలో మంత్రులు, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలతో అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు ఉంటాయని పేర్కొన్నారు.