ATP: పీఎం కిసాన్, అన్నదాత సుఖీభవ నిధులు విడుదలయ్యాయి. అనంతపురం, సత్యసాయి జిల్లాల్లోని 5,40,682 మంది రైతులకు ప్రభుత్వం రూ.367.68 కోట్ల నిధులను విడుదల చేసింది. కేంద్రం రూ.2వేలు, రాష్ట్రం రూ.5 వేలు కలిపి ఒక్కో రైతు బ్యాంకు ఖాతాలో రూ.7వేల చొప్పున నగదు జమకాగా, రైతుల ఖాతాల్లో డబ్బులు పడినట్లు ఫోన్లకు మెసేజ్లు వస్తున్నాయి.