భారత్, దక్షిణాఫ్రికా జట్ల మధ్య గౌహతి వేదికగా శనివారం రెండో టెస్టు ప్రారంభం కానుంది. గౌహతి పిచ్‌ను క్యూరేటర్ ఎర్రమట్టితో సిద్ధం చేశారు. దీంతో ఎక్కవ పేస్, బౌన్స్ జనరేట్ అయ్యే అవకాశం ఉంది. టీమిండియా కోరినట్లు పిచ్‌లో టర్న్ ఉంటుంది. అయితే, బౌన్స్ మరీ ఎక్కువగా ఉండకుండా క్యూరేటర్లు జాగ్రత్త తీసుకున్నట్లు బీసీసీఐకి చెందిన ఓ అధికారి వెల్లడించారు.