హీరో ధనుష్‌పై నటి మాన్య ఆనంద్ సంచలన ఆరోపణలు చేసింది. ధనుష్ వండర్‌బార్ ప్రొడక్షన్స్‌లో నటించే అవకాశమిస్తామని, ఇందుకు కమిట్మెంట్ ఇవ్వాలని శ్రేయస్ అనే వ్యక్తి కాల్ చేశాడని తెలిపింది. ధనుష్ కోసమైనా ఒప్పుకోవా అంటూ ఒత్తిడి తెచ్చాడని పేర్కొంది. దీనిపై ధనుష్ టీం క్లారిటీ ఇచ్చింది. ఎవరో కావాలనే ఇలా చేస్తున్నారని, దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేశామని తెలిపింది.