ఆస్ట్రేలియన్ ఓపెన్ ప్రపంచ టూర్ సూపర్ 500 టోర్నీలో భారత స్టార్ జోడీ సాత్విక్ సాయిరాజ్, చిరాగ్ శుభారంభం చేశారు. పురుషుల డబుల్స్ తొలి రౌండ్లో ఈ ద్వయం చాంగ్ చి- లీ వీ (చైనీస్ తైపీ) జంటను చిత్తు చేసి గెలిచి ప్రిక్వార్టర్ ఫైనల్లో అడుగుపెట్టింది. మరోవైపు మహిళల డబుల్స్‌లో గాయత్రి గోపీచంద్- ట్రీసా జాలీ జోడీ ఇండోనేసియా ప్లేయర్ల చేతిలో ఓటమిపాలైంది.