VZM: ఎల్.కోటలో జరిగిన బాబా శతజయంతి ఉత్సవాలకు ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారి బుధవారం హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన ఆమెకు పుష్పగుచ్చం ఇచ్చి స్థానికులు స్వాగతం పలికారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. శతజయంతి ఉత్సవాల్లో పాల్గొనడం అదృష్టంగా భావిస్తున్నానని తెలిపారు. బాబా సూచించన మార్గంలో అందరూ నడుచుకోవాలని ఆకాంక్షించారు.