GDWL: ఆలంపూర్ ఎమ్మెల్యే విజయుడు బుధవారం అయిజ మండల కేంద్రంలోని పులికల్, కిసాన్ నగర్ గ్రామాలలో వరి ధాన్య కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. రైతులు కష్టపడి పండించిన పంటలను దళారులకు విక్రయించి మోసపోవద్దని సూచించారు. ప్రభుత్వం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మార్కెట్లలోనే తమ విక్రయించి, కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు.