KDP: ప్రభుత్వానికి నోటీసులు మీద ఉన్న శ్రద్ధ హామీల అమలులో లేదని సీపీఎం నగర కార్యదర్శి రామ్మోహన్ విమర్శించారు. సీఎం పర్యటన సందర్భంగా వన్ టౌన్ పోలీసులు వారి హౌస్ అరెస్టుకు నోటీసులు ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లాకు ఎన్నో హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేశారన్నారు. ఉక్కు ఫ్యాక్టరీ పది రోజుల్లో మొదలెడుతామని చెప్పి ఇంతవరకు ఒక రాయి కూడా వేయలేదన్నారు.