ADB: ఈ నెల 20న పత్తి కొనుగోలు నిలిపివేయనున్నట్లు జిల్లా వ్యవసాయ మార్కెట్ కమిటీ అధికారులు బుధవారం తెలిపారు. అమావాస్య సందర్భంగా కొనుగోలు నిలిపివేయడం జరిగిందన్నారు. మళ్లీ 21 నుంచి యథావిధిగా కొనుగోలు నిర్వహించటం జరుగుతుందని పేర్కొన్నారు. రైతులు ఈ విషయాన్ని గమనించి సహకరించాలని కోరారు.