ASF: పెంచికలపేట్ మండల కేంద్రానికి చెందిన సుంకరి భాగ్య, కాగజ్ నగర్‌కి చెందిన సమీర్, పోతరాజుల కవితలకి మంజూరైన సీఎం సహాయనిధి చెక్కులను ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా MLC దండే విఠల్ బుధవారం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ పథకం పేద ప్రజలకు ఆపద సమయంలో సంజీవినిలా పని చేస్తోందని అన్నారు. వైద్య రంగానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తుందన్నారు.