TG: వరంగల్‌లోని ఎనుమాముల మార్కెట్ యార్డును మాజీ మంత్రి హరీష్ రావు పరిశీలించారు. ఈ సందర్భంగా రైతుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. సీసీఐ చర్యలతో పత్తి రైతులు రోడ్డున పడ్డారని మండిపడ్డారు. విధి లేక దళారులకు రైతులు అమ్ముకోవాల్సి వస్తుందని తెలిపారు. క్వింటాల్‌కు 2 వేలకుపైగా నష్టపోతున్నారని వెల్లడించారు.