అనకాపల్లి: డ్రగ్స్ నిర్మూలనకు ప్రతి ఒక్కరు సహకరించాలని అనకాపల్లి ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ విజ్ఞప్తి చేశారు. మాదకద్రవ్యాలకు వ్యతిరేకంగా చేపట్టిన అభ్యుదయ సైకిల్ ర్యాలీ మంగళవారం అనకాపల్లి చేరుకుంది. ఈ ర్యాలీకి అనకాపల్లిలో ఘన స్వాగతం లభించింది. అనంతరం నిర్వహించిన సభలో ఎమ్మెల్యే మాట్లాడుతూ.. డ్రగ్స్‌కు అందరూ దూరంగా ఉండాలని పిలుపునిచ్చారు.