AP: కృష్ణా జిల్లా పెనమలూరులో ఆక్టోపస్ ఆపరేషన్ చేపట్టారు. ఆటోనగర్‌లో భారీగా మావోయిస్టు డంప్ సీజ్ చేసి 27 మందిని అదుపులోకి తీసుకున్నారు. అందులో AK47, డిటోనేటర్లు సహా పేలుడు పదార్థాలు ఉన్నట్లు సమాచారం. నిందితులు కూలీల పేరుతో ఓ భవనాన్ని అద్దెకు తీసుకుని షెల్టర్‌జోన్‌గా మార్చుకున్నట్లు గుర్తించారు. నిందితులు ఛత్తీస్‌గఢ్‌కు చెందినవారిగా తెలుస్తోంది.