RR: షాద్ నగర్ మున్సిపాలిటీలో ఎన్నికల నిర్వహణను పారదర్శకంగా చేపట్టేందుకు మున్సిపల్ కమిషనర్ సునీతను ఈఆర్వోగా ఎన్నికల అధికారులు నియమించారు. ఈ సందర్భంగా ఆమె షాద్ నగర్ మున్సిపల్ కార్యాలయంలో మహిళా సంఘాల నాయకులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. అనంతరం మహిళా సంఘాలకు ఎన్నికల ప్రక్రియ, ఓటరు నమోదు పై అవగాహన కల్పించారు.