దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి టెస్టులో టీమిండియా కెప్టెన్ గిల్ గాయపడిన విషయం తెలిసిందే. అయితే, శనివారం నుంచి జరగనున్న రెండో టెస్టులో గిల్ ఆడకుంటే అతడి స్థానంలో రుతురాజ్ గైక్వాడ్‌కు అవకాశం ఇవ్వాలని టీమిండియా మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా పేర్కొన్నాడు. రుతురాజ్ అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడని తెలిపాడు. రంజీ, దులీప్ ట్రోఫీల్లో చక్కగా రాణించాడని వెల్లడించాడు.