VZM: మెడికల్ విద్య అందరికీ అందుబాటులో ఉండాలని, ప్రైవేటీకరణ వల్ల సాధారణ కుటుంబాలకు భారంగా మారుతుందని మాజీ ఎమ్మెల్యే బొత్స అప్పలనరసయ్య పేర్కొన్నారు. గంట్యాడ మండలం నరవలో మంగళవారం రాత్రి ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజలు ఐక్యంగా నిలిచి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.