WNP: జిల్లాలోని అన్ని ప్రభుత్వ విద్యాలయాల్లో మౌలిక సదుపాయాలు కల్పించేందుకు చర్యలు తీసుకోవాలని వనపర్తి జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి స్పష్టం చేశారు. మంగళవారం ఐడీవోసీ సమావేశ మందిరంలో సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. వసతి గృహాల్లో ఉండే విద్యార్థులకు చలి కాలంలో ఇబ్బందులు లేకుండా కిటికీలు మరమ్మతులు చేయించుకోవాలన్నారు.