KMR: జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ ఐకేపీ మహిళలు నిర్వహిస్తున్న ధాన్యం కొనుగోలు కేంద్రాలపై సంతృప్తి వ్యక్తం చేశారు. మండలంలోని శాబ్దిపూర్లోని ఐకేపీ కొనుగోలు కేంద్రాన్ని కలెక్టర్ సందర్శించారు. మహిళలు ఆర్థిక అభివృద్ధి సాధించేందుకు వీలుగా జిల్లాలో పలుచోట్ల ధాన్యం కొనుగోలు కేంద్రాల నిర్వహణ బాధ్యతను వారికి అప్పగించినట్లు తెలిపారు.