CTR: గుడిపల్లి మండలం గుత్తార్ల పల్లి గ్రామస్థులు అందరూ కలిసి CC కెమెరాలు ఏర్పాటు చేసుకున్నారు. పోలీసుల సూచనల నేపథ్యంలో సుమారు రూ.1.60 లక్షలు సమకూర్చుకున్నారు. గ్రామం నలు దిక్కులా 11 కెమెరాలు ఏర్పాటు చేసుకున్నారు. కెమెరాల మానిటరింగ్ DVR కోసం లైబ్రరీలో TV ఏర్పాటు చేశారు. మంగళవారం కెమెరాలను MLC శ్రీకాంత్, CI మల్లేష్ యాదవ్ ప్రారంభించారు. అనంతరం గ్రామస్థులను అభినందించారు.