KRNL: అన్న క్యాంటీన్లో ప్రభుత్వం అందించిన మెనూ ప్రకారం ప్రజలకు భోజనాన్ని అందించాలని జిల్లా కలెక్టర్ సిరి అన్నారు. ఇవాళ ఆదోని పట్టణంలోని ప్రసూతి ఆసుపత్రి పక్కన ఉన్న అన్న క్యాంటీన్‌ను కలెక్టర్ ఆకస్మిక తనిఖీ చేశారు. భోజనానికి వచ్చిన ప్రజల ప్లేట్లలో స్వయంగా భోజనం వడ్డించి వారితో మాట్లాడారు. క్యాంటిన్ పరిసర ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సిబ్బందికి తెలిపారు.