KRNL: ఎమ్మిగనూరులో ఇవాళ నిర్వహించిన ప్రజాదర్బార్లో పాల్గొన్న MLA జయనాగేశ్వర్ రెడ్డి 200లకు పైగా అర్జీలు స్వీకరించినట్లు పేర్కొన్నారు. ముఖ్యంగా కొత్త పెన్షన్లు, ఇండ్ల స్థలాలు, భూ సమస్యలు, నీటి కొళాయి కనెక్షన్లు, వీధి లైట్స్, సీసీ రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థ గ్రావెల్ తదితర సమస్యపై ప్రజలు వినతిపత్రాలు అందజేశారు. అర్జీలను క్షుణ్ణంగా పరిశీలించి తగిన పరిష్కారం చూపుతామన్నారు. కూటమి ప్రభుత్వం ప్రజలకు అండగా ఉంటుందని తెలిపారు.