KMM: నేలకొండపల్లిలోని ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో ప్రిన్సిపల్ పరంజ్యోతి అధ్యక్షతన మాదకద్రవ్యాల నిరోధ అవగాహన కార్యక్రమాన్ని మంగళవారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎక్సైజ్ సీఐ సుంకరి రమేష్ పాల్గొన్నారు. ఈ మేరకు సమాజంలో మాదకద్రవ్యాల ప్రభావం అధికమైందని దానిని నివారించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు చేపడుతున్నాయని తెలిపారు.