MBNR: హన్వాడ మండల కేంద్రంలో ఆటో డ్రైవర్లకు ట్రాఫిక్ అవగాహనపై ప్రత్యేక కౌన్సెలింగ్‌ను ఎస్సై వెంకటేష్ శుక్రవారం నిర్వహించారు. డ్రైవర్లు తప్పనిసరిగా ట్రాఫిక్ నిబంధనలు పాటించి, ప్రయాణికుల భద్రతకు ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. అతివేగం, ఓవర్లోడింగ్, మైనర్లతో వాహనాలు నడిపించడం వంటి ప్రమాదకర చర్యలను పూర్తిగా మానుకోవాలని ఆయన హెచ్చరించారు.